ఆదుర్తి సుబ్బారావు తన మొదటి సినిమా నిర్మాత డి.బి.నారాయణకు దాగుడు మూతలు చేసిపెట్టాల్సివుంది. దాని స్క్రిప్ట్ పనికి ముళ్లపూడిని సినీరంగంలోకి తీసుకువస్తే అది సాగకపోగా రమణ మరో రెండు రీమేక్ సినిమాలకు రాసి విజయవంతమై ఉన్నారు. అయితే దాగుడుమూతలు సినిమా ఎప్పుడు రాద్దామని రమణ అడుగుతూండగా అది పక్కనపెట్టి మూగమనసులు స్క్రిప్ట్ పూర్తిచేయమన్నారు ఆదుర్తి. అయితే ఆ క్రమంలోనే డి.బి.నారాయణతో దాగుడుమూతలు సినిమా సంగతి మరోసారి చూడవచ్చు, ప్రస్తుతం మీరే ఈ సినిమాని నిర్మించమని ఆదుర్తి ఆఫర్ చేశారు. అయితే ఎన్టీఆర్ అప్పటికే డిబిఎన్ కు దాగుడుమూతలు సినిమా తీస్తే డేట్లిస్తానని కమిట్ అయి ఉన్నారు. అందువల్ల చేస్తే ఎన్టీ రామారావుతోనే చేస్తానని డి.బి.ఎన్. అన్నారు. దానికీ ఆదుర్తి అంగీకరించి మూగమనసుల్లో హీరోగా ఎన్టీఆర్ ని పెట్టుకుందామని సిద్ధం కాగా, రామారావు స్టూడియోల్లో తప్ప అవుట్-డోర్ షూటింగులకు ఒప్పుకోవట్లేదని ఈ సినిమా మొత్తం గోదావరి ప్రాంతంలోనే అవుట్-డోర్ లో తీయాల్సివస్తుందని కాబట్టి నాగేశ్వరరావును పెట్టుకుని మీరే తీసుకోండి అనేశారు డి.బి.ఎన్. దాంతో సినిమా హీరోగా నాగేశ్వరరావునే నిర్ణయించుకున్నారు.[3] అలా హీరో పాత్రకి నాగేశ్వరరావుని అనుకోగా, లోతైన భావాలు పండించాల్సిన రాధ పాత్రకి సావిత్రిని, హుషారైన పల్లెటూరి పిల్ల గౌరిగా జమునని ఎంచుకున్నారు. మూగమనసులు కథాప్రకారం (స్క్రీన్ ప్లే) సహితంగా రాసేసుకున్నాకా సికిందరాబాద్ క్లబ్ లో స్టార్ మీటింగ్ ఏర్పాటుచేశారు ఆదుర్తి. ముఖ్యపాత్రలు పోషిస్తున్నవారికీ, డిస్ట్రిబ్యూటర్ నవయుగ నుంచి వాసు, శర్మ, చంద్రశేఖరరావులు, ఇతర కథ, దర్శకత్వ శాఖల వారూ అందులో పాల్గొన్నారు. కథ అందరికీ నచ్చడంతో ప్రధానపాత్రలు ధరించే నటులంతా అక్కడే అంగీకరించారు. అలానే సినిమా నిర్మాణానికి ఫైనాన్షియర్ గానూ, అనంతరం విడుదలకు డిస్ట్రిబ్యూటర్ గానూ వ్యవహరించే నవయుగ వాసు కూడా సినిమాకు అంగీకారం తెలపారు.[1]
దాగుడు మూతలు చిత్ర నిర్మాత ఎవరు?
Ground Truth Answers: డి.బి.నారాయణడి.బి.నారాయణ
Prediction: